
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పెరుగుదల బాట పట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి ధరలు నేడు (March 8) మళ్లీ ఎగిశాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,400, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,710 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున ఎగిశాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,860 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,550 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.550, రూ.500 చొప్పున పెరిగాయి.
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,710 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున భారమయ్యాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,08,100 వద్ద, ఢిల్లీలో రూ. 99,100 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)