Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఆగినట్టే ఆగి మళ్లీ పుంజుకున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న పసిడి నేడు (సెప్టెంబర్ 23) మరింత ఖరీదైంది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు కొనుగోలుదారులను నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. నాలుగు రోజులలో తులం బంగారం సుమారు రూ.1700 దాకా పెరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.69,800 వద్దకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల పుత్తడి కూడా రూ.220 పెరిగి రూ. 76,150 వద్దకు చేరుకుంది. ఇక బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే విధంగా రేట్లు పెరిగాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.69,950 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.76,300 లకు ఎగిశాయి.
ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్‌బీఐ స్పషల్ స్కీమ్
నిలకడగా వెండి 
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి కదలిక లేదు. రెండో రోజు కూడా  సిల్వర్ ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
