బంగారం ధరలు ఊహకందని రీతిలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఆగస్టు 01న రూ.1,44,220 వద్ద ఉన్న గోల్డ్ రేటు, ఈ రోజుకు (ఆగస్టు 31) రూ.1,56,770 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. నెల రోజుల్లో పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ నెల (ఆగస్టు) ప్రారంభంలో హైదరాబాద్, విజయవాడలలో రూ.1,44,220 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఆగస్టు 31కి రూ.1,56,770 వద్దకు చేరింది. అంటే నెల రోజుల్లో రూ.12550 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు రూ.1,32,200 నుంచి రూ.1,43,700 (రూ.11,500 పెరిగింది) వద్దకు చేరింది.
ఢిల్లీ కూడా బంగారం ధరలలో చాలా మార్పులు జరిగాయి. ఇక్కడ నెల ప్రారంభంలో రూ.1,32,350 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు నేటికి రూ.1,43,700 (రూ.11350 పెరిగింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,44,370 నుంచి రూ.1,56,770 (రూ.12400 పెరిగింది) వద్దకు చేరింది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ సిల్వర్ రేటు 30 రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది. అంటే నెల రోజుల్లో 25000 రూపాయలు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైపోతుంది.


