బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం

Gold from a bore well in odisha - Sakshi

సాధారణంగా బోరు వేస్తే నీరు వస్తుంది, అదృష్టం బాగాలేకపోతే అది కూడా లేదు. అయితే ఇటీవల ఒక రైతు భూమిలో బోరు వేస్తే ఏకంగా బంగారం పొడి బయటకు వచ్చిందని తెలిసింది. ఇంతకీ వచ్చింది బంగారమేనా? ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా చంచన బహాలి గ్రామానికి చెందిన మహమ్మద్‌ జావెద్‌ అనే రైతు తన భూమిలో బోరు వేస్తే బురదతో పాటు బంగారం పడిందంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు బోరు నుంచి వెలువడిన మట్టి శాంపిల్ తీసి టెస్ట్ చేయడానికి పంపించారు.

(ఇదీ చదవండి: ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు)

స్థానిక ఖప్రఖోల్ తహసీల్దార్ ఆదిత్య ప్రసాద్ మిశ్రా బోరును పరిశీలించి తరువాత సీజ్ చేశారు. పసుపు రంగులో మట్టితో కలిసి బయటపడిన నమూనాలలో తప్పకుండా బంగారు కణికలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ల్యాబ్ టెస్ట్ తరువాత అతి అసలైన బంగారమా? కాదా? అని తెలుస్తుంది.

(ఇదీ చదవండి: Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలా? ఇది మీకోసమే!)

డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం, ఒడిశాలోని డియోగర్, కియోంజర్, మయూర్‌భంజ్‌తో సహా మూడు జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ జాబితాలో బొలంగీర్ లేదు. అయితే ఆ ప్రాంతంలో గ్రాఫైట్, మాంగనీస్, విలువైన రాళ్లు ఉన్నాయని జిఎస్‌ఐ గతంలోనే తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top