Gold Price Today: బంగారం ధరల వరుస తగ్గింపులకు బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు నేడు (నవంబర్ 15) స్వల్పంగా పెరిగాయి. గడిచిన ఆరు రోజుల్లో తులానికి (10 గ్రాములు) రూ.3800 పైగా తగ్గిన బంగారం మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఎంత మేర పెరిగాయో పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర స్వల్పంగా రూ.100 పెరిగి రూ.69,450 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగి రూ. 75,760 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే విధంగా ధరలు పెరిగాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.69,600 వద్దకు పుంజుకోగా, 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.75,910 వద్దకు ఎగిసింది.
ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
Silver Price Today: దేశవ్యాప్తంగా నేడు వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.99,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
