 
													Gold Price Today: పిసిడి ప్రియుల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. దేశవ్యాప్తంగా నేడు (నవంబర్ 12) బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే తులానికి (10 గ్రాములు) సుమారు రూ.1500 మేర దిగివచ్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఎంతెంత తగ్గాయో ఇక్కడ అందిస్తున్నాం.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర భారీగా రూ.1350 తగ్గి రూ.70,850 లకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.1470 క్షీణించి రూ. 77,290 వద్దకు దిగివచ్చింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు క్షీణించాయి.
ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల్లో నేడు భారీ తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రూ.1350 తగ్గి రూ.71,000 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.1470 తగ్గి రూ.77,440 వద్దకు దిగొచ్చింది.
వెండి కూడా భారీగానే..
Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీ స్థాయిలో క్షీణించాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.2000 తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి రూ.1,00,000 వద్దకు వచ్చి చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
