 
													దేశంలో బంగారం ధరలు (Gold Price) వరుసగా రెండో రోజూ మరింత పెరిగాయి. మూడు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు క్రితం రోజున ఉన్నట్టుండి స్వల్పంగా పెరిగాయి. ఈ పెరుగుదలను కొనసాగిస్తూ నేడు (January 9) మరింతగా ఎగిశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.
బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.350 (22 క్యారెట్స్), రూ.380 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,600కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,200 వద్దకు ఎగిశాయి.
ఇతర ప్రాంతాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,350 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,750 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.350,  రూ.380 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.350 పెరిగి రూ. 72,600 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.380 బలపడి రూ. 79,200 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ. 92,500 వద్ద ఉన్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
