లాభాల్లోకి గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ | Sakshi
Sakshi News home page

లాభాల్లోకి గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌

Published Sat, May 28 2022 4:47 AM

Godrej Industries turnaround results in q4 results - Sakshi

న్యూఢిల్లీ: ప్రైయివేట్‌ రంగ దిగ్గజం గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 423 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 92 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,611 కోట్ల నుంచి రూ. 4,445 కోట్లకు జంప్‌చేసింది.

అయితే మొత్తం వ్యయాలు రూ. 2,814 కోట్ల నుంచి రూ. 4,202 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం రూ. 391 కోట్ల నుంచి రూ. 992 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 51 శాతం జంప్‌చేసి రూ. 14,130 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 9,334 కోట్ల టర్నోవర్‌ మాత్రమే సాధించింది. నాదిర్‌ గోద్రెజ్‌ను మరో మూడేళ్లపాటు అంటే 2026 మార్చి 31వరకూ చైర్మన్, ఎండీగా బోర్డు తిరిగి ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది.  

ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ షేరు 9% జంప్‌చేసి రూ. 477 వద్ద ముగిసింది. 

Advertisement
Advertisement