సిబిల్‌ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్‌ లోన్‌ వస్తుందా!

Get Personal Loan For Low Cibil Score - Sakshi

బ్యాంక్‌ నుంచి పొందే లోన్‌ ఎటువంటిదైనా సిబిల్‌ స్కోర్‌ బాగుండాలి. సిబిల్‌ స్కోర్‌ బాగుంటేనే మనం బ్యాంక్‌ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్‌ పేమెంట్‌ చేయక పోవడం వల్ల బ్యాంక్‌లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్‌ స్కోర్‌ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్‌ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది.  

వడ్డీ రేటు ఎక్కువే 
పర్సనల్‌ లోన్‌కి సిబిల్‌ స్కోర్‌ చాలా అవసరం. కాబట్టి సిబిల్‌ స్కోర్‌ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్‌ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నా బ్యాంక్‌ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్‌ లు లోన్లను రిజెక్ట్‌ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్‌ స్కోర్‌ సరిగ్గా లేకపోయినా లోన్‌ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు  ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు  సిబిల్‌ స్కోర్‌ సరిగ్గా లేకుండా మన లోన్‌ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ‍్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ  రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. 

క్రెడిట్‌ స్కోర్‌ ఎందుకు తగ్గిపోతుంది
►క్రెడిట్‌ కార్డ్‌ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట‍్లు క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్‌, ఈఎంఐ చెల్లించకపోవడం

►నాలుగైదు నెలల ఈఎంఐని  ఒకేసారి కట్టడం 

►తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్‌ కార్డ్‌ల కోసం అప్లయి చేయడం  

►క్రెడిట్‌ కార్డ్‌ ను లిమిట్‌గా వాడుకోకపోవడం వల్ల సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోతుంది. మీ క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ కనీసం 750లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top