ప్రపంచంలోనే టాప్ - 10 స్మార్ట్ ఫోన్స్

This Galaxy Device Was Samsung Best Selling Smartphone in Q3 2020 - Sakshi

 ఐదు ఫోన్లు శామ్‌సంగ్ వే!

ఈ ఏడాది 3వ త్రైమాసికం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో శామ్‌సంగ్, ఆపిల్‌ను దాటేసింది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ కానలిస్ తాజాగా 2020 మూడో త్రైమాసికంలో(జులై-సెప్టెంబర్) స్మార్ట్ ఫోన్ మార్కెట్ రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం ఈ త్రైమాసికంలో 34.8 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. 2020 మూడో త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్‌సంగ్ తిరిగి మొదటి స్థానాన్ని పొందగలిగింది. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి పది స్మార్ట్‌ఫోన్‌లలో ఐదు మొబైల్ ఫోన్లు శామ్‌సంగ్ తయారు చేసినట్లు కానలిస్ నివేదిక తెలిపింది. (చదవండి: ప్రపంచంలో బెస్ట్ డిస్‌ప్లే ఫోన్ ఇవే!)

ప్రముఖ రీసెర్చ్ సంస్థ కానలిస్ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం, గెలాక్సీ ఎ21ఎస్ ఫోన్లు ఈ ఏడాది 3వ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ లు. గెలాక్సీ ఎ21ఎస్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మూడవ మొబైల్ ఫోన్. గెలాక్సీ A11(10 మిలియన్లు), గెలాక్సీ A51(8 మిలియన్), గెలాక్సీ A31(5 మిలియన్లు), గెలాక్సీ A01కోర్(4 మిలియన్) ఫోన్లు నాలుగవ, ఐదవ, ఎనిమిదవ, పదవ స్థానాలలో నిలిచాయి. 

కానలిస్ జాబితాలోని అన్ని శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ ఎ సిరీస్ నుండి వచ్చినవి కావడం ఆసక్తికరం. 2020 క్యూ3 సమయంలో ఐఫోన్ 11(16 మిలియన్లు), ఐఫోన్ ఎస్ఇ 2020(10 మిలియన్లు) ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన రెండు స్మార్ట్‌ఫోన్‌లు. షియోమి రెడ్‌మి నోట్ 9 సిరీస్(6 మిలియన్లు), రెడ్‌మి 9(5 మిలియన్లు), రెడ్‌మి 9A(5 మిలియన్లకు దగ్గరగా) వరుసగా ఆరో, ఏడవ, తొమ్మిదవ స్థానాలలో నిలిచాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top