లాభాల్లో ప్రభుత్వ కంపెనీ..షేర్‌ హోల్డర్లకి బంపరాఫర్‌!

Gail Declares Record Dividend For Financial Year - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ యుటిలిటీ దిగ్గజం గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22) రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5(50 శాతం) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు మహారత్న కంపెనీ గెయిల్‌ వెల్లడించింది. 

ఇందుకు ఈ నెల 22 రికార్డ్‌ డేట్‌కాగా.. మొత్తం చెల్లింపులకు రూ. 2,220 కోట్లకుపైగా వెచ్చించనుంది. కంపెనీ ఇప్పటికే 2021 డిసెంబర్‌లో షేరుకి రూ. 4 చొప్పున డివిడెండును చెల్లించింది.

వెరసి ఈ ఏడాదిలో ఒక్కో షేరుకీ రూ. 9 చొప్పున మొత్తం రూ. 3,996 కోట్లకుపైగా డివిడెండు కింద వెచ్చి‍స్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనోజ్‌ జైన్‌ వెల్లడించారు. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేశారు! కాగా.. ప్రస్తుతం కంపెనీలో గల 51.45% వాటా ప్రకారం ప్రభుత్వం రెండో మధ్యంతర డివిడెండుకింద రూ. 1,142 కోట్లు అందుకోనుంది.

చదవండి: మే 12వరకూ ఎల్‌ఐసీకి గడువు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top