'హనూమన్' ఏఐ గురించి ఆసక్తికర విషయాలు.. | Full Details About BhartaGPT Hanooman AI | Sakshi
Sakshi News home page

Hanooman AI: భారత్‌జీపీటీ 'హనూమన్' గురించి ఆసక్తికర విషయాలు..

Feb 22 2024 9:04 AM | Updated on Feb 22 2024 10:51 AM

Full Details About BhartaGPT Hanooman AI - Sakshi

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 'ఏఐ' (AI) రంగంలో దూసుకెళ్తున్నారు. ఐఐటీ బాంబే, ఇతర ఎనిమిది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల సహకారంతో అంబానీకి చెందిన సీతా మహాలక్ష్మి హెల్త్‌కేర్ (SML) 'హనూమాన్'ను (Hanooman) ఆవిష్కరించింది. త్వరలో రానున్న ఈ ఏఐ మోడల్ ఇప్పటికే ఉన్న ఛాట్‌జీపీటీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుంది.

 👉 హనూమాన్ ఏఐ మోడల్ కేవలం టెక్స్ట్‌కు మాత్రమే పరిమితం కాకుండా స్పీచ్, వీడియో వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది 22 భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాబట్టి యూజర్ తమ సొంత భాషలోనే ఉపయోగించుకోవచ్చు.

 👉 హనూమన్ సిరీస్‌లో మొదలై నాలుగు మోడల్స్ 1.5 బిలియన్స్ నుంచి 40 బిలియన్ పారామీటర్స్ వరకు ఉండే పరిమాణాలతో వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

 👉 భారతదేశంలో భాషా వైవిద్యం ఏఐ అభివృద్ధికి పెద్ద సవాలు, అయినప్పటికీ హనూమాన్ ఏఐ మోడల్ ప్రారంభంలో 11 భాషలకు మద్దతు ఇస్తుంది. మొత్తం 22 భాషల్లో దీనిని తీసుకురావడమే లక్ష్యంగా సంస్థ ముందుకు వెళ్తోంది. ఇందులో ఇంగ్లీష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

 👉 హనూమాన్ ఏఐ టెక్నాలజీ స్థానిక భాషలకు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి రైతులు కూడా వారి భాషలో సలహాలను తీసుకోవచ్చు, సందేహాలను నివృతి చేసుకోవచ్చు.

 👉 ఎన్నో సవాళ్ళను అధిగమించి హనూమాన్ భారతీయ ఏఐ రంగంలో అడుగుపెట్టనుంది. ఇది సాధారణ వ్యక్తులు, వ్యారస్థులు, ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 👉 భారతదేశంలో ఏఐ టెక్నాలజీ పెరుగుతుండడంతో పలు కంపెనీలు దీనిమీదనే ద్రుష్టి సారిస్తున్నాయి. కాబట్టి హనూమాన్ కూడా దేశంలో ప్రత్యర్థుల నుంచి కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ఈ ఏడాది శాలరీ హైక్.. వారికే ఎక్కువ!.. సర్వేలో కీలక విషయాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement