
శంషాబాద్: ఉడాన్ పథకంలో భాగంగా ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్‌కు సర్వీసులను ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మహారాష్ట్ర గొండియా మీదుగా హైదరాబాద్‌కు ఈ నెల 13 నుంచి సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రధాన నగరాలతో పాటు టైర్–2, టైర్–3 నగరాలను అనుసంధానించడంలో భాగంగా సర్వీసులను విస్తరిస్తున్నట్లు సంస్థ సీఎండీ సంజయ్ మాండవియా తెలిపారు. మే 2వ వారంలో ఈశాన్య రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ప్రసుతం దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది గమ్యస్థానాలకు 20 సర్వీసులు కొనసాగుతున్నాయన్నారు.
చదవండి: జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా.. మీరే మాకు స్పూర్తి!