ఫ్లిప్‌కార్ట్‌లో మరో అదిరిపోయే సేల్!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ప్రత్యేక సేల్‌తో ముందుకు వచ్చింది. మార్చి 24 నుంచి మార్చి 30 వరకు జరిగే ఈ సేల్‌లో అన్నీ రకాల స్మార్ట్ పోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో బ్యాంకులు సైతం కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 13ను రూ. 61,999కే విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ.69,900గా ఉంది. అదే వేరియంట్‌లో ఐఫోన్ 14పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 తగ్గింపు ఆఫర్ ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఇటీవల విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 256జీబీ స్టోరేజ్ రూ. 79,999 అమ్మకానికి ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డ్‌ని ఉపయోగించి రూ. 74,999ని పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో 5జీ రెడ్‌మీ నోట్ 12 ప్రో రూ. 24,999 అమ్ముతుంది. ఇదే ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను వినియోగిస్తే రూ. 2,000 తగ్గింపు ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి27 అసలు ధర రూ. 32,999 వద్ద ఉండగా..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,500 తగ్గింపు ఆఫర్‌తో రూ. 30,499 కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లపై సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
మరిన్ని వార్తలు