ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ వచ్చేశాయి.. మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!

Flipkart Big Saving Days Sale Beginning on Sunday Major Deals on Phones Revealed - Sakshi

మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లపై 80 శాతం వరకు

సాక్షి, ముంబై: కొత్తగా మొబైల్‌ ఫోన్లను కొనేవారికి శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో వినియోగదారులకు ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు సేల్‌ కొనసాగనుంది. కాగా ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను వినియోగదారులకు అందించనుంది. ప్రముఖ కంపెనీల మొబైల్‌ ఫోన్లు ఈ సేల్‌లో భారీగా తగ్గనున్నాయి.

గూగుల్‌ పిక్సెల్‌, ఐఫోన్‌, ఆసుస్‌, శాంసంగ్‌ గెలాక్సీ తదితర ఫోన్ల ఆఫర్‌ ధరలను ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే జూన్‌ 12 అర్ధరాత్రి నుంచే బిగ్‌ సేవింగ్‌ డేస్‌ అందుబాటులోకి రానుంది. మొబైల్‌ ఫోన్లతో పాటుగా ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లపై 80 శాతం వరకు, స్మార్ట్‌ వాచ్‌లపై 60 శాతం వరకు, టాబ్లెట్‌లపై 50 శాతం వరకు, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లపై సుమారు 30శాతం వరకు డిస్కౌంట్లను అందించనున్నాయి.

మొబైల్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ఆఫర్లు ఇవే
మొబైల్‌ ఫోన్‌ అసలు ధర ఆఫర్‌ ధర
గూగుల్‌ పిక్సెల్‌ 36,250 26,999
ఐఫోన్‌ 11 ప్రో   79, 899  74,999
మోటోరొలా రేజర్‌ 5జీ  1,09,999  89,999
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 12 10,999 9999
ఆసుస్‌ రాగ్‌ ఫోన్‌ 3 46,999 41,999
ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌  41,999   39,999

వీటితో పాటుగా బడ్జెట్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ ఫోన్స్‌ జియోనీ మ్యాక్స్‌ ప్రో, ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 5, మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ నోట్‌ 1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనున్నాయి. అంతేకాకుండా ఎస్బీఐ కార్డు ద్వారా షాపింగ్‌ చేసే వినియోగదారులకు పది శాతం ఇన్‌స్టాంట్‌ తగ్గింపును అందించనుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top