ఐఫోన్‌ లవర్స్‌కు బంపర్‌ ఆఫర్‌: 10వేల దాకా తగ్గింపు

Flipkart Big Bachat Dhamaal sale: iPhone12 mini and 13 mini - Sakshi

సాక్షి, ముంబై: ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌. తాజా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఆపిల్‌  ఐఫోన్ 12 మినీపై  భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. జూలై ఒకటినుంచి ప్రారంభమైన ఈ సేల్‌ మరో రెండు రోజులు మాత్రమే కొనసాగుతుంది.  ప్రధానంగా ఐఫోన్లపై బెస్ట్ డీల్స్  ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్‌ 14 మిని ఈ ఏడాదికి రాదనే అంచనాల మధ్య తాజా తగ్గింపు ధరలపై మరింత ఆసక్తి  నెలకొంది. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో వినియోగదారులు ఐఫోన్ 12 మినీ రూ.49,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.59,900 అంటూ 6 శాతం తగ్గింపు అందిస్తోంది. 

ఐఫోన్‌ 12 మిని : 5.4 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, ఏ14 బయోపనిక్‌ సాక్‌, 12 ఎంపీ డ్యూయల్ కెమెరా ప్రధాన ఫీచర్లు.  దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ 12,500 వరకు ఎక్స్చేంజ్‌ డీల్‌.

ఐఫోన్‌ 13 మిని : 128 జీబీ స్టోరేజ్‌ మోడల్‌పై  7 శాతం తగ్గింపుతో దాదాపు 65,299లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.  గతంలో వెబ్‌సైట్‌లో దీని ధర రూ. రూ. 69,999. యాక్సిస్‌ బ్యాంక్ కార్డ్‌ ద్వారా అదనపు 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు 6 నెలల ఫ్రీ గానా ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. నిబంధనల మేరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌తో 12,500 తగ్గుతుంది. ఈ ఆఫర్లనీ అమలైతే ఐఫోన్‌ 13 మిని  సుమారు 55 వేలకు సొంతం చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top