అద్భుతమైన ఏడుగురం కలిశాం: గూగుల్‌ మాజీ ఉద్యోగి స్టోరీ వైరల్‌  

Fired 7 People By Google Come Together To Form New Company - Sakshi

న్యూఢిల్లీ:  ఉద్యోగం పోయిందని విచారిస్తూ కూచుంటే ఫలితం ఉండదు. ముందు కాస్త బాధపడినా త్వరగానే  కోలుకొని మళ్లీ  కొత్త  ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సిందే. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌ తొలగించిన ఏడుగురు  ఉద్యోగులు అదే చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి కొత్త స్టార్టప్‌ కంపెనీ ఆవిష్కారానికి నాందిపలికారు. ఇంకా పేరు ఖరారు చేయని వారి సంస్థ, ఇతర "స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి , నిధులు పొందేందుకు" సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.  లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేసిన వీరి స్టోరీ వైరల్‌గా మారింది. 

గూగుల్‌ గత నెలలో సుమారు 12 వేలమందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఖర్చు తగ్గింపు చర్యలో భాగంగా తొలగించినవారిలో గూగుల్‌  సీనియర్ మేనేజర్‌ హెన్రీ కిర్క్ కూడా ఒకరు.  తన స్నేహితులతో  ఇపుడు కొత్త కంపెనీని మొదలు పెడుతున్నామని కిర్క్‌  తెలిపారు.  సహ ఉద్యోగులతో కలిసి న్యూయార్క్‌, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్ డెవలప్‌మెంట్ స్టూడియోను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం తన బృందానికి ఆరు వారాల సమయం ఇచ్చినట్లు లింక్డ్‌ఇన్‌లో  కిర్క్‌ పేర్కొన్నాడు.

ఉద్యోగుల తొలగింపు నోటిఫికేషన్ 60 రోజుల గడువు మార్చిలో ముగిసేలోపు కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇంకా 52 రోజులు మిగిలి ఉన్నాయి. మీ సహాయం కావాలి....కష్టపడితే , ఫలితాలు మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకువెళతాయని ఎపుడూ నమ్ముతా. కానీ ఈ సంఘటన ఆ నమ్మకంపై సందేహాన్ని కలిగించింది. కానీ జీవిత సవాళ్లు అద్వితీయమైన అవకాశాలను అందిస్తాయి.. అందుకే  విషాదాన్ని.. గొప్ప అవకాశంగా మల్చుకుంటున్నాం అంటూ కిర్క్‌ గత వారం లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో చెప్పాడు.

తనతో మరో ఆరుగురు గూగుల్  మాజీఉద్యోగులు తన  వెంచర్‌లో  చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.  ఈ విషాదాన్ని ఒక అవకాశంగా మార్చుకుని కొత్త డిజైన్ & డెవలప్‌మెంట్ స్టూడియోను ప్రారంభిస్తున్నాం. స్టార్టప్‌లకు, ఇతర కంపెనీల యాప్‌లు, వెబ్‌సైట్‌ల కోసం డిజైన్ పరిశోధన సాధనాలను అందించాలనుకుంటున్నాం.  ఉద్వాసనకు గురైన అత్యుత్తమ మాజీ-గూగ్లర్‌లు ఏడుగురం   ప్రతిష్టాత్మక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ల పరిశోధన, రూపకల్పన, అభివృద్ధికి, స్టార్టప్‌లు ఎదిగేలా సాయం చేస్తాం. తమలో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉన్నంది. కొంతమందికి కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక కుటుంబం ఉంటుంది, కొంతమందికి లేదు, కొందరు ఆర్థికంగా బలంగా ఉన్నారు, మరికొందరు గత కొన్నేళ్లుగా ఎంతో కొంత పొదుపు చేసుకున్నారు. కొందరికీ అదీ లేదు. ఈ నేపథ్యంలో ముందుగా, కొన్ని ప్రాజెక్ట్‌లను పొందడం తక్షణ  కర్తవ్యం. తద్వారా  బిల్లులను చెల్లించడం ప్రారంభించవచ్చు. తమకు మద్దతివ్వాలంటూ పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు అభినందనలు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top