ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు అదనపు మూలధనం

Finance Ministry plans Rs 3,000 crore additional capital infusion - Sakshi

2023–24లో రూ. 3,000 కోట్లు

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు గట్టెక్కేందుకు మరింత తోడ్పాటు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 3,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

2022 ఆర్థిక సంవత్సరంలో మూడు సంస్థలు – నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కేంద్రం రూ. 5,000 కోట్లు సమకూర్చింది. ఇందులో నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అత్యధికంగా రూ. 3,700 కోట్లు, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌కు రూ. 1,200 కోట్లు, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 100 కోట్లు దక్కాయి. ప్రభుత్వ రంగంలో మొత్తం నాలుగు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఉండగా న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ మాత్రమే స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top