Sakshi News home page

ఎఫ్‌డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్‌

Published Tue, Mar 5 2024 8:32 AM

FD Rates Will Increase In Bandhan Bank - Sakshi

ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న బంధన్‌ బ్యాంక్‌ తన వినియోగదారులకు మరింత సేవలందించేలా చర్యలు తీసుకుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. 

500 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై వయో వృద్ధులకు(సీనియర్‌ సిటిజన్లు) 8.35 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది. సాధారణ వ్యక్తులకు 7.85 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేటును 7.25 శాతంగా నిర్ణయించింది. 5-10 ఏళ్ల వ్యవధికి 5.85 శాతం వడ్డీని అందిస్తోంది. 

ఇదీ చదవండి.. ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ పసిడి రుణాలపై ఆర్‌బీఐ నిషేధం

సీనియర్‌ సిటిజన్లకు 6.60 శాతంగా నిర్ణయించింది. పొదుపు ఖాతాలో రోజువారీ నిల్వ రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి 7 శాతం వడ్డీనిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కొత్తగా రెండు శాఖలను ప్రారంభించినట్లు బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం శాఖల సంఖ్య 142కు చేరినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుకు 1664 శాఖలున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement