స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి ఫేస్‌బుక్ | Facebook Reportedly Working on a Smartwatch | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి ఫేస్‌బుక్

Feb 15 2021 8:17 PM | Updated on Feb 15 2021 8:49 PM

Facebook Reportedly Working on a Smartwatch - Sakshi

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటుంది. వచ్చే ఏడాదిలో స్మార్ట్‌వాచ్ ను మార్కెట్ లోకి తీసుకురావాలని ఫేస్‌బుక్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ స్మార్ట్‌వాచ్ లో తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుందా లేదా గూగుల్, ఐఓఎస్ పై ఆధారపడుతుందా అనేది స్పష్టంగా లేదు. ఈ స్మార్ట్‌వాచ్ లో ప్రధానంగా ఆరోగ్యం, ఫిట్నెస్ పై దృష్టి సారించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఆపిల్ స్మార్ట్‌వాచ్ తరహాలోనే ఫేస్‌బుక్ స్మార్ట్‌వాచ్ ద్వారా కూడా మెసేజ్, కాల్స్ చేసుకునే ఫీచర్స్ తీసుకొనిరానున్నారు.  

ఫేస్‌బుక్ గతంలో ఓకులస్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లు, పోర్టల్ వీడియో చాట్ పరికరాలను అభివృద్ధి చేసింది. వాచ్ కాకుండా ఫేస్‌బుక్ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్, ప్రాజెక్ట్ అరియా అని పిలువబడే అగ్‌మెంటెడ్ రియాలిటీ రీసెర్చ్ పనిచేస్తుందని సమాచారం. టైట్ కంపెనీ ఈ అగ్‌మెంటెడ్ రియాలిటీ ప్రాజెక్టు కోసం 6000 మంది ఉద్యోగులను పనిచేస్తున్నారు. ఫేస్‌బుక్ ఈ వార్తలను ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.  క్లబ్‌హౌస్ మాదిరిగానే ఒక యాప్ రూపకల్పనలో కూడా ఫేస్‌బుక్ పనిచేస్తున్నట్లు సమాచారం. 

చదవండి:
మోటో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement