ఆగస్టులో ఎగుమతులు.. ‘ప్లస్సే’  

Exports inch up pace of growth in imports slows in August - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు ఆగస్టులో వృద్ధినే నమోదుచేసినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ బుధవారం వెలువరించిన సవరిత గణాంకాలు స్పష్టం చేశాయి. సమీక్షా నెల ఎగుమతుల్లో 1.62 శాతం వృద్ధి నమోదయిందని, విలువలో ఇది 33.92 డాలర్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఇదిలాఉండగా, నెలవారీగా తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత అవి వృద్ధిబాటలోకి రావడం ఇది వరుసగా రెండవనెల. జూలైలో తొలి గణాంకాలు క్షీణత (–0.76) నుంచి 2 శాతం వృద్ధికి మారాయి. ఆగస్టు విషయంలో తొలి గణాంకాల క్షీణ అంచనా మైనస్‌ 1.15 శాతం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top