ట్రంప్‌నకు మద్దతు.. మస్క్‌ కంపెనీలు ఎంత పెరిగాయంటే.. | Elon Musk Support Donald Trump And His Company Shares Value Increasing In Premarket Trading, See Details | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు మద్దతు.. మస్క్‌ కంపెనీలు ఎంత పెరిగాయంటే..

Nov 7 2024 12:47 PM | Updated on Nov 7 2024 1:57 PM

elon musk support trump and his company stock value increasing

ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్‌మస్క్‌ తన విజయానికి ఎంతో కృషి చేసినట్లు స్వయంగా డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ట్రంప్‌ గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న మార్కెట్లు గడిచిన రెండు సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అనుకున్న విధంగానే ఆయన గెలుపు ఖరారైంది. దాంతో మస్క్‌ ఆధ్వర్యంలోని కంపెనీల స్టాక్‌ విలువ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు సెషన్‌ల్లో దాదాపు రూ.రెండు లక్షల కోట్లు మేర వీటి విలువ పెరిగినట్లు మార్కెట్‌ అంచనా వేస్తుంది.

ప్రభుత్వ ఏజెన్సీల సడలింపులు

మస్క్‌ కంపెనీల్లోకెల్లా ముఖ్యంగా టెస్లా, స్పేస్‌ ఎక్స్‌, న్యూరాలింక్‌ సంస్థలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్‌ ట్రంప్‌తో మస్క్‌కు ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆయా కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్‌

మస్క్‌ ఆధ్వర్యంలోని కంపెనీలు ఇవే..

  • టెస్లా

  • స్పేస్‌ఎక్స్‌

  • న్యూరాలింక్‌

  • ది బోరింగ్‌ కంపెనీ

  • ఎక్స్‌ కార్పొరేషన్‌

  • జిప్‌ 2

  • పేపాల్‌

  • స్టార్‌లింక్‌

  • ఎక్స్‌ ఏఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement