ఉద్యోగుల తొలగింపు..మరింత దూకుడుగా ఎలన్‌ మస్క్‌!

Elon Musk Says Next 3 months Tesla Will Fire 10 Percent Of Workforce - Sakshi

ఉద్యోగుల తొలగింపు అంశంలో టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేబర్‌ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మరింత దూకుడు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మస్క్‌ ఉద్యోగుల కోత విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

బ్లూమ్ బ‌ర్గ్ నిర్వహించిన కతర్ ఎకనమిక్‌ ఫోరంలో ఎలన్‌ మస్క్‌ పాల్గొన్నారు. రానున్న 3 నెలల్లో టెస్లాకు చెందిన 10శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. తద్వారా టెస్లాలో ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు 3.5శాతం తగ్గిపోనున్నట్లు చెప్పారు. 

సూపర్‌ బ్యాడ్‌ ఫీలింగ్‌ 
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభం నుంచి టెస్లాను బయట పడేందుకు మస్క్‌ కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా గత జూన్‌ నెలలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇంటర్నల్‌గా టెస్లా ఉద్యోగులకు మెయిల్‌ పెట్టినట్లు రాయిటర్స్‌ కథనం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి సూపర్‌ బ్యాడ్‌ ఫీలింగ్‌'గా ఉందని, అందుకే ఉద్యోగుల తొలగింపు, నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు మస్క్‌ చెప్పారంటూ రాయిటర్స్‌ హైలెట్‌ చేసింది. కానీ ఉద్యోగులు తొలగింపుపై స్పష్టత ఇవ్వని మస్క్‌  తాజాగా ఆ కథనాలకు ఊతం ఇచ్చేలా ఉద్యోగుల కోతను అధికారికంగా వెల్లడించారు.

చదవండి👉'జీతాలిచ్చే వాళ్లపై జోకులేస్తే ఇలాగే ఉంటది', ఎలన్‌ మస్క్‌కు భారీ ఝులక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top