ట్విటర్‌లో కుక్క ఫొటో.. రయ్‌మని దూసుకెళ్లిన విలువ, బోనస్‌గా మస్క్‌కి షాక్‌

Elon Musk Floki Coin Value Jumps After Pet Dog Photo Tweet - Sakshi

ప్రపంచ అపర కుబేరుడిగా, టెస్లా బాస్‌గా, స్పేస్‌ఎక్స్‌ సీఈవోగా..  పరిచయం ఉన్న ఎలన్‌ మస్క్‌.. ఇంటర్నెట్‌లో మీమ్స్‌ పోస్ట్‌ చేయడంతో పాటు అప్పుడప్పుడు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను సైతం ప్రభావితం చేస్తుంటాడు. నమ్మరా?.. అయితే ఏప్రిల్‌లో మీమ్‌ క్రిప్టోకరెన్సీ డోజ్‌కాయిన్‌ విలువను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు తన పెంపుడు కుక్క పోస్ట్‌తో మరోసారి అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ విలువలో తీవ్రమార్పులు తీసుకొచ్చాడు.
 

డోజ్‌కాయిన్లను రెగ్యులర్‌గా ప్రమోట్‌ చేసే మస్క్‌.. ఇప్పుడు తన కోసం రంగంలోకి దిగాడు. సోమవారం ఉదయం మస్క్‌ తన పెంపుడు కుక్క ఫ్లోకి(షిబా ఇను జాతికి చెందిన పప్పీ) ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో డోజ్‌కాయిన్‌, ఫ్లోకి ఇను కాయిన్‌ విలువలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే రెండు రోజులు గడిచినప్పటికీ ఈ విలువలో ఎలాంటి పతనం కనిపించకపోవడం విశేషం. 

తన పెంపుడుకుక్క మీద క్రిప్టోకరెన్సీ మొదలుపెట్టిన మస్క్‌.. ఇప్పుడు వాటిని తెలివిగా ప్రమోట్‌ చేస్తుండడం విశేషం. అయితే క్రిప్టోకరెన్సీ మీద జనాల ఫోకస్‌ మళ్లేలా చేస్తున్న ఎలన్‌ మస్క్‌ మీద గతకొంతకాలంగా నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. నమ్మించి తెలివిగా జనాల్ని ముంచేస్తున్నాడంటూ తిట్టిపోస్తున్నారు.  ఈ తరుణంలో మస్క్‌ను ఉల్టా పెద్ద షాక్‌ ఇచ్చారు.  #స్టాప్‌ఎలన్‌ (#StopElon) పేరుతోనూ క్రిప్టోకరెన్సీని డిజిటల్‌ లావాదేవీల్లోకి తీసుకురావడం విశేషం.

చదవండి: సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్‌..!

ఇక గత ఇరవై నాలుగు గంటల్లో ఫ్లోకి ఇను కాయిన్‌.. 22.13 శాతం పెరగ్గా.. ఆ క్రిప్టోకరెన్సీ విలువ 0.00006116డాలర్‌గా ఉంది. ఇక షిబు ఇను కాయిన్‌(SHIB) విలువ ఏకంగా 55 శాతం పెరిగి, 0.00001312డాలర్‌గా నిలిచింది. ఇదంతా మస్క్‌ చేసిన మాయాజాలం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే గుర్తతెలియని బయ్యర్‌(అది ఎలన్‌ మస్క్‌ ఏమో అని ఒక అనుమానం కూడా) ఒకరు SHIB కాయిన్స్‌ను 6.3 ట్రిలియన్‌ కాయిన్స్‌(సుమారు నాలుగున్నర కోట్ల డాలర్ల విలువచేసేవి) కొనుగోలు చేయడం విశేషం.  

చదవండి: చిలిపి మస్క్‌..  ‘అడల్ట్‌’ కరెన్సీ ప్రమోషన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top