భారత్‌పై ఎలాన్‌ మస్క్‌ స్వీట్‌ రివెంజ్‌!

Elon Musk Fires Twitter Ceo Parag Agarwal - Sakshi

మూవీ క్లైమాక్స్‌ను తలపించిన బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌..ట్విట్టర్‌ కొనుగోలు అంశం ఎట్టకేలకు ముగిసింది. కోర్టు ఇచ్చిన గడువు లోపే భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన మస్క్‌..భారత్‌పై రివెంజ్‌ తీర్చుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి ట్విట్టర్‌లోని తాజా పరిణమాలు.  

బిలియనీర్‌, టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ మస్క్‌కు అక్టోబర్‌ 28 సాయంత్రం 5 గంటల లోపు ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రకారమే మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లతో (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు) మైక్రో బ్లాగింగ్‌ సంస్థను దక్కించుకున్నారు.  

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్‌,లీగల్‌ ఎగ్జిక్యూటీవ్‌ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌ సహా మరికొంత మంది టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లను మస్క్‌ తొలగించారు. 

మస్క్‌ బాస్‌ అయితే ట్విట్టర్‌లో తొలగింపులు ఉంటాయంటూ ముందు నుంచి వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ భారతీయుడైన ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని ఫైర్‌ చేయడం చర్చాంశనీయంగా మారింది. ఈ తరుణంలో మస్క్‌ భారత్‌పై రివెంజ్‌ తీర్చుకున్నారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

అందుకు ఊతం ఇచ్చేలా గతంలో భారత్‌ విషయంలో మస్క్‌కు ఎదురైన చేదు అనుభవాల్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఎలాన్‌ మస్క్‌ తన టెస్లా కార్లను ఇక్కడ అమ్మకాలు జరిగేలా ఏడాది పాటు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చలు జరుగుతున్న సమయంలో దేశీయంగా టెస్లా షోరూంలు, స్వరీస్‌ సెంటర్ల కోసం స్థలాల్ని వెతికారు. అయితే  చైనాలో తయారైన టెస్లా కార్లను భారత్‌లో దిగుమతి చేసి విక్రయిస్తామని, దిగుమతి సుంకాల్ని తగ్గించాలని ప్రతిపాదించారు. మస్క్‌ ప్రతిపాదనల్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించింది. తొలత తమ కార్లను ఇక్కడ అమ్మడానికి, సర్వీస్‌ చేయడానికి అనుమతిస్తే భారత్‌లో ఎలక్ట్రిక్‌ వెహిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభిస్తామని మస్క్‌ తెగేసి చెప్పారు. 

ఆ తర్వాత శాటిలైట్‌ ఇంటర్నెట్‌ స్టార్‌ లింక్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా 32దేశాల్లో అందిస్తున్నారు. ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్‌ అనువైన దేశంగా భావించి.. గతేడాది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

సేవల కంటే ముందు బుక్సింగ్‌ ప్రారంభించింది. లైసెన్స్‌ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న మస్క్‌ ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్‌ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్‌ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్‌. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్‌ ఇండియా డైరెక్టర్‌ పదవికి సంజయ్‌ భార్గవ రాజీనామా చేయడంతో మస్క్‌కు భంగపాటు ఎదురైంది.

అందుకే మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలతో ఆ సంస్థ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌,లీగల్‌ ఎగ్జిక్యూటీవ్‌ విజయ గద్దెలను ఫైర్‌ చేశారని, అలా మస్క్‌ భారత్‌పై స్వీట్‌ రివెంజ్‌ తీర్చుకున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

చదవండి👉 ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు..సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య అదిరిపోయే ట్విస్ట్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top