Elon Musk Reaction To Allegations Of Affair With Google Co Founder Wife, Details Inside - Sakshi
Sakshi News home page

Elon Musk: ఏందీ రచ్చ! ఆమెతో ఎఫైర్‌.. ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదే!

Jul 26 2022 11:45 AM | Updated on Jul 26 2022 1:04 PM

Elon Musk Denies Allegations Of Affair With Google Co Founder Wife - Sakshi

ఎలాన్‌ మస్క్‌, ఎలాన్‌ మస్క్‌, ఎలాన్‌ మస్క్‌ ప్రస్తుతం నెట్టింట మారుమోగుతోంది ఈ పేరు. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్నీ విషయాల్లోనూ తళుక్కున మెరుస్తున్నాడు ఈ టెస్లా అధినేత. మొన్న జానీ డెప్‌ వ్యవహారంలో, నిన్న ట్విటర్‌, ప్రస్తుతం ప్రాణ స్నేహితుడి భార్యతో ఎఫైర్‌ ఇలా విషయాలు వేరైనా కామన్‌గా వినిపించే పేరు మాత్రం ఎలాన్‌ మస్క్‌. 

అసలు కథేంటి
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యతో ఎలాన్‌ మస్క్‌కు ఎఫైర్ ఉందని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా బాస్ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వాటిని ఖండించారు. ఈ విషయంపై ట్వీట్‌ కూడా చేశారు. అందులో.. " ఇది పూర్తిగా అబద్దం. సెర్జీ, నేను స్నేహితులం. గత రాత్రే మేమిద్దరం పార్టీలో కలిశాం. నేను అతని భార్య నికోల్‌ను మూడు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే చూశాను, అది కూడా గుంపుగా ఉన్నప్పుడు. ఈ వ్యవహారంలో మరో రకంగా అనుకోవడానికి ఏమి లేద’’ని ట్వీట్‌ చేశారు.

వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం..
గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. తన దగ్గరి స్నేహితుడు . ఎలాన్‌ మస్క్‌ , సెర్జీ బ్రిన్‌ గతంలో మంచి స్నేహితులు. ఎంతలా అంటే ఎలాన్‌ మస్క్‌ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసేంత సాన్నిహిత్యం ఉంది. అలాంటిది సర్జీ, మస్క్‌కు వ్యతిరేకంగా ఎలన్‌ మస్క్‌ కంపెనీల్లోని వాటాలన్నీ అమ్మేసుకున్నాడని, వీటితో పాటు తన సలహాదారులకు కూడా మస్క్‌ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇచ్చాడని తెలిపింది.  

దీనికి ప్రధాన కారణంగా..  సర్జీ బ్రిన్‌ భార్య నికోల్‌ షన్‌హన్‌తో ఎలన్‌ మస్క్‌ వివాహేతర సంబంధం నడిపాడని, ఈ వ్యవహారం వల్లే సర్జీ-నికోల్‌ మధ్య విబేధాలు ముదిరాయని, అలాగే సర్జీ-మస్క్‌ మధ్య స్నేహం చెడిందంటూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం ప్రచురించింది. స్నేహితుడి భార్యతోనే మస్క్‌ ఎఫైర్‌ నడిపాడని, గత డిసెంబర్‌లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్‌, నికోల్‌కు క్షమాపణలు కూడా తెలియజేశాడన్నది ఆ కథనం సారాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement