ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనే వారికి గుడ్‌న్యూస్‌..!

Electric Vehicles Likely To Get Registration Fee Waiver - Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆర్‌సీ ఫీజు నుంచి మినహాయింపు 

కేంద్రం ప్రతిపాదన

న్యూఢిల్లీ: దేశీయంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బ్యాటరీ ఆధారిత వాహనాలకు (బీవోవీ) రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీ, రెన్యువల్‌కి సంబంధించిన ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునివ్వాలని ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌ 1989కి సవరణలు చేయనున్నట్లు పేర్కొంది. సాధారణ ప్రజలు, పరిశ్రమవర్గాలు దీనిపై 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top