డాలర్‌,యూరోకి షాకిచ్చే కరెన్సీ? ‘గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్’  గురించి తెలుసా? 

do you know Global Country of World Peace Nation with no land stronger currency than Dollar and Euro - Sakshi

గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్  గురించి ఎపుడైనా విన్నారా.భూమి లేని దేశం కానీ డాలర్, యూరో కంటే బలమైన కరెన్సీ  దీని సొంతమా?  నిజంగా ఈ కరెన్సీ అంత విలువైందా? మహర్షి మహేశ్ యోగి 2020 అక్టోబర్‌ 7న  స్థాపించిన  దీని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం

ఒక విధంగా చెప్పాలంటే ఆసక్తికరమైన, ప్రత్యేకమైన దేశం గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నుండి శాంతియుత, సామరస్యపూర్వక వ్యక్తులను ఒకచోట చేర్చడమే దీని లక్ష్యం. మహర్షి మహేశ్ యోగి  మరణానంతరం ప్రస్తుతం మహర్షి గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్‌కి న్యూరాలజిస్ట్, అధినేత రాజా రామ్ (టోనీ నాడార్) అధినేతగా ఉన్నారు. .

గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ దాని స్వంత కరెన్సీని రామ్ అని పిలుస్తారు. ఇది లోకల్‌ కరెన్సీ. దీన్నే బేరర్ బాండ్ అని కూడా పిలుస్తారు.ఇది అయోవా, నెదర్లాండ్స్‌లో ఉపయోగిస్తున్నారు. ఐరోపాలో 10 యూరోలు, అమెరికా 10 డాలర్లకు సమానమైన ‘రామ్’. రామ్ 1, 5, 10 వివిధ డినామినేషన్లలో  లభ్యం.  ఇది ఇప్పటికే ఉన్న కరెన్సీలను భర్తీ చేయదు కానీ  నిర్దిష్ట లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చు. రామ్‌ను బ్యాకప్ చేయడానికి బంగారాన్ని ఉపయోగించడాన్ని సంస్థ ప్రోత్సహిస్తుంది. 2001లో మహర్షి మహేష్ యోగి జారీ చేసిన కరెన్సీని డచ్ సెంట్రల్ బ్యాంక్ అనుమతించిందట. (వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్‌)

అమెరికాలోని పలు నగరాల్లో నిర్మించిన "శాంతి భవనాలు" మరో విశేషం. ఈ భవనాలు దేవాలయాలు పోలిఉంటాయి. ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు, మూలికా సప్లిమెంట్లు, అతీంద్రియ ధ్యానం వంటి వాటిపై బోధిస్తారు. బెథెస్డా, మేరీల్యాండ్, హ్యూస్టన్ ఆస్టిన్, టెక్సాస్, ఫెయిర్‌ఫీల్డ్, అయోవా, సెయింట్, పాల్, మిన్నెసోటా , లెక్సింగ్టన్, కెంటుకీ వంటి నగరాల్లో వీటిని చూడవచ్చు. గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్‌ అంతిమ లక్ష్యం హింస లేదా సంఘర్షణ లేని ప్రపంచాన్ని సృష్టించడమేనని చెబుతారు. వారి బోధనలు, అభ్యాసాలతో అంతర్గత శాంతిని, సామరస్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. 2008 ఫిబ్రవరి 5న నెదర్లాండ్స్‌లోని తన నివాసంలో మహర్షి యోగి కన్నుమూశారు. 

(ఇదీ చదవండి: Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్‌ ఏంటి?)

ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ  రామ్‌ అంటూ  2020లో సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అయితే  రామ్‌  అనేది లోకల్‌ కరెన్సీ మాత్రమే తప్ప, గ్లోబల్‌ కరెన్సీగా గుర్తించలేమని ఆ సందర్భంగా నిపుణులు కొట్టిపారేశారు. మరోవైపు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్  వాటికన్‌ లాంటి స్వతంత్ర నగర రాజ్యంగా ను ఏర్పాటు చేయాలని  సార్వభౌమాధికార హోదాను పొందేందుకు ప్రయత్నిస్తోంది. వారు అనేక దేశాల నుండి భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, కాని స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వారి భూమిని విక్రయించడానికి అంగీకరించలేదు. ఒకవేళ సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఆ తరువాత దేశానికి ఒక  సెంట్రల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుంటే, అపుడు రామ్ కరెన్సీ రెగ్యులర్ లీగల్ టెండర్ హోదాను పొందుతుందనేది నిపుణుల మాట. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top