అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలన | Dissanayake Govt Has Decided To Reconsider The Approval For Adani Wind Power Project, See Details | Sakshi
Sakshi News home page

అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలన

Oct 15 2024 8:24 AM | Updated on Oct 15 2024 9:22 AM

Dissanayake has decided to reconsider the approval for Adani project

పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకోసం అదానీ గ్రూప్‌నకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఆమోదాన్ని పునఃపరిశీలిస్తామని కొత్తగా ఏర్పడిన శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు అనురా కుమార దిసానాయకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్రీలంక సుప్రీంకోర్టుకు వివరాలు తెలియజేసింది.

ప్రాజెక్టును సమీక్షించాలని అక్టోబర్‌ 7న జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐదుగురు సభ్యులు కలిగిన సుప్రీంకోర్టు బెంచ్‌కి ప్రభుత్వం తెలియజేసింది. నవంబర్‌ 14న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కొత్త కేబినెట్‌ ఏర్పాటయ్యాక తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు విన్నవించింది. సెప్టెంబర్‌ 21 అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రెసిడెంట్‌ దిసానాయకే తన నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) కూటమి ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ శ్రీలంక ఇంధన రంగ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిందని.. తాము విజయం సాధించిన తర్వాత ప్రాజెక్టును రద్దు చేస్తామని ఎన్‌పీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.

ఇదీ చదవండి: ‘పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’

అదానీ గ్రూప్‌ శ్రీలంకలోని ఈశాన్య ప్రాంతాలైన మన్నార్, పూనేరిన్‌లలో 484 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేలా గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 20 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా 440 మిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ శ్రీలంక సుప్రీంకోర్టులో ప్రాథమిక హక్కుల వ్యాజ్యాన్ని ఎదుర్కొంది. పర్యావరణ ఆందోళనలు, అదానీ గ్రీన్‌ ఎనర్జీకి అనుమతినిచ్చే బిడ్డింగ్‌ ప్రక్రియలో పారదర్శకత లోపాన్ని పిటిషనర్లు  లేవనెత్తారు. ఒక కిలోవాట్‌ అవర్‌కు అంగీకరించిన 0.0826 డాలర్ల టారిఫ్‌ శ్రీలంకకు నష్టాన్ని కలిగిస్తుందని.. ఇది 0.005 డాలర్లకు తగ్గించాలని పిటిషనర్లు వాదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement