Dipam Secretary Tuhin Comments On LIC Share Price Declining - Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ విషయంలో అలా జరగడం తాత్కాలికమే

Jun 11 2022 11:08 AM | Updated on Jun 11 2022 12:35 PM

Dipam Secretary Tuhin Comments On LIC Share Price Declining - Sakshi

న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ షేరు తగ్గుదల ఆందోళనకరంగా అనిపిస్తున్నప్పటికీ, ఇది తాత్కాలికమైనదేనని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. సంస్థ ఫండమెంటల్స్‌ గురించి షేర్‌హోల్డర్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ఎల్‌ఐసీ పరిశీలించి, వాటాదారులకు మరింత విలువను చేకూర్చేందుకు తగు చర్యలు తీసుకుంటుందని పాండే వివరించారు.

గత నెలలో నిర్వహించిన ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కేంద్రం రూ. 20,500 కోట్లు సమీకరించింది. అయితే మే 17న లిస్టయిన దగ్గర్నుంచి ఎల్‌ఐసీ షేరు క్షీణిస్తూనే ఉంది. ఇష్యూ ధర రూ. 949 కాగా గరిష్టంగా రూ. 920 స్థాయిని మాత్రమే తాకగలిగింది. అప్పట్నుంచి పతనబాటలోనే ఉన్న షేరు శుక్రవారం బీఎస్‌ఈలో రూ. 709.70 వద్ద క్లోజయ్యింది.

చదవండి:  ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement