విస్తరణ బాటలో ఫనాటిక్స్‌

Digital Sports Arena Fanatics Changed Its Office To Knowledge City - Sakshi

డిజిటల్ స్పోర్ట్స్ వేదిక ఫనాటిక్స్ విస్తరణ బాట పట్టింది.  కొత్తగా వందమందిని రిక్రూట్‌ చేసుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు పెరుగుతున్న సిబ్బంది తగ్గట్టుగా కార్యాలయాన్ని నాలెడ్జ్‌ సిటీలో ఉన్న సత్వ భవనంలోకి మార్చింది. కొత్తగా నియమితులవుతున్న వంద మంది ఉద్యోగుల్లో  సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆన్ లైన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లు ఉండనున్నారు. 

డిజిటల్‌ స్పోర్ట్స్‌ వేదికైన ఫనాటిక్స్ ఒకే ఒక ఉద్యోగితో 2018లో ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో  170 మంది ఉద్యోగులు ఉన్నారను. 2022 చివరి నాటికి హైదరాబాద్‌లో వర్క్‌ఫోర్స్‌ సంఖ్యను 250కి పెంచుకోవాలని ఫనాటిక్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

చదవండి: Swiggy Drone Deliveries: స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్‌ కొడితే చాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top