16 కోపరేటివ్‌ బ్యాంకు కస్టమర్లకు మంచిరోజులు!

DICGC to pay up to Rs 5 lakh to account holders of 21 insured banks - Sakshi

డీఐసీజీసీ కింద రూ.5 లక్షల వరకు చెల్లింపులు

న్యూఢిల్లీ: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న 16 కోపరేటివ్‌ బ్యాంకు కస్టమర్లు.. ఒక్కొక్కరికి డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) కింద గరిష్టంగా రూ.5 లక్షల వరకు దక్కనుంది. డీఐసీజీసీ 21 బ్యాంకులతో ఒక జాబితాను రూపొందించగా.. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సహా ఐదు బ్యాంకులను ఈ పథకం కింద మినహాయించింది. డీఐసీజీసీ కింద బ్యాంకులు సంక్షోభం పాలైతే.. డిపాజిట్‌ దారునకు గరిష్టంగా రూ.5లక్షలు పరిహారం చెల్లించే బిల్లుకు పార్లమెంటు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆమోదం తెలుపగా.. సెప్టెంబర్‌ 1న ప్రభుత్వం నోటిఫై చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top