ఫెస్టివ్‌ సీజన్‌: గుడ్‌న్యూస్‌ 75 వేల ఉద్యోగాలు

Delhivery looks to hire over 75k employees in festive season demand - Sakshi

75,000 మందిని నియమించనున్న ‘డెలివరీ’ 

ముంబై: సరుకు రవాణా సేవల్లో ఉన్న డెలివరీ (Delhivery) సీజనల్‌ ఉద్యోగాల కోసం వచ్చే ఒకటిన్నర నెలలో 75,000 మందిని నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్‌ కంపెనీ తరఫున డెలివరీ గేట్‌వేస్, గిడ్డంగులు, డెలివరీ విభాగాల్లో 10,000 మంది ఉంటారు.

పండుగ సీజన్‌లో పార్సెల్, ఎక్స్‌ప్రెస్‌ పార్ట్‌–ట్రక్‌ లోడ్‌ వ్యాపారం రెండింటిలోనూ ఆశించిన అధిక డిమాండ్‌ను చేరుకోవడం లక్ష్యంగా కొత్త వారిని చేర్చుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో పార్ట్-ట్రక్‌లోడ్ సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించేందుకు  వ్యక్తిగత బైకర్లు, స్థానిక రిటైలర్లు, వ్యాపార భాగస్వాములు, రవాణాదారులను నియమించుకోవడం ద్వారా భాగస్వామ్య కార్యక్రమాలను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. (PAN India 5G: కీలక విషయాలు వెల్లడించిన టెలికాం మంత్రి)

అధిక కస్టమర్ డిమాండ్‌ నేపథ్యంలో పాన్-ఇండియాలో పార్శిల్ సార్టింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1.5మిలియన్ షిప్‌మెంట్‌లు లక్క్ష్యంగా పెట్టుకున్నామని  డెలివరీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ పాయ్ అన్నారు. (jobmarket: ఉద్యోగాలపై ఇన్‌ఫ్లేషన్‌ ఎఫెక్ట్‌! తాజా రిపోర్ట్‌ ఏం చెబుతోంది?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top