Delhivery
-
రూ.1400 కోట్ల డీల్.. డెల్హివరీ చేతికి ఈకామ్ ఎక్స్‌ప్రెస్
ముంబై: లాజిస్టిక్స్ సర్వీసు ప్రొవైడర్ డెల్హివరీ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈకామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు సుమారు రూ.1400 కోట్లు వెచ్చించనుంది. పూర్తి నగదు రూపంలోనే చెల్లింపు చేసేలా ఒప్పందం ఖరారు చేసుకుంది. ‘‘ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము. 99.4 శాతం వాటాను రూ.1407 కోట్లకు కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది’’ అని డెల్హివరీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.గురుగ్రామ్‌కు చెందిన ఈకామర్స్ ఎక్స్‌ప్రైస్ 2012 ఆగస్టులో ప్రారంభమైంది. అప్పటి నుంచి 200 కోట్ల షిప్మెంట్లు డెలివరీ చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,607.3 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.2,548.1 కోట్లుగా ఉంది. విలీన ప్రక్రియకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంది.ఈ డీల్ ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని డెల్హివరీ అంచనా వేస్తోంది. ఈ విలీనంతో కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించే అవకాశం లభిస్తుందని కంపెనీ ఎండీ, సీఈఓ సాహిల్ బారువా తెలిపారు. డెల్హివరీతో భాగస్వామ్యం వల్ల మరింత వృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుందని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థాపకులు కే సత్యనారాయణ పేర్కొన్నారు. -
డెల్హివరి నుంచి కార్లయిల్ ఔట్ 2.53% వాటా విక్రయం
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం కార్లయిల్ తాజాగా సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలోగల మొత్తం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.53 శాతం వాటాకు సమానమైన 1.84 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్‌డీల్ వివరాల ప్రకారం షేరుకి రూ. 385.5 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 710 కోట్లకు అమ్మివేసింది. షేర్లను కొనుగోలు చేసిన జాబితాలో బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్, నార్జెస్ బ్యాంక్, సొసైటీ జనరాలి, సౌదీ సెంట్రల్ బ్యాంక్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితరాలున్నాయి. ఎక్సే్ఛంజీ గణాంకాల ప్రకారం మార్చికల్లా డెల్హివరీలో యూఎస్ సంస్థ కార్లయిల్ 2.53 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది నవంబర్‌లో డెల్హివరీలో 2.5 శాతం వాటాను కార్లయిల్ రూ. 607 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 387 వద్ద ముగిసింది. -
డెల్హివరీలో తగ్గిన సాఫ్ట్‌బ్యాంక్ వాటా
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలో 3.8 శాతం వాటాను విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్‌డీల్ సమాచారం ప్రకారం అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ డోర్‌బెల్(కేమన్) ద్వారా 2.8 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 340.8 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 954 కోట్లకుపైనే. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ, సిటీ ఆఫ్ న్యూయార్క్ గ్రూప్ ట్రస్ట్, సొసైటీ జనరాలి, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలున్నాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి డెల్హివరీలో ఎస్వీఎఫ్ డోర్‌బెల్ వాటా 18.42 శాతం నుంచి 14.58 శాతానికి తగ్గింది. బ్లాక్‌డీల్ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 341 వద్ద స్థిరపడింది. -
ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు
ముంబై: సరుకు రవాణా సేవల్లో ఉన్న డెలివరీ (Delhivery) సీజనల్ ఉద్యోగాల కోసం వచ్చే ఒకటిన్నర నెలలో 75,000 మందిని నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్ కంపెనీ తరఫున డెలివరీ గేట్వేస్, గిడ్డంగులు, డెలివరీ విభాగాల్లో 10,000 మంది ఉంటారు. పండుగ సీజన్లో పార్సెల్, ఎక్స్‌ప్రెస్ పార్ట్–ట్రక్ లోడ్ వ్యాపారం రెండింటిలోనూ ఆశించిన అధిక డిమాండ్‌ను చేరుకోవడం లక్ష్యంగా కొత్త వారిని చేర్చుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో పార్ట్-ట్రక్లోడ్ సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించేందుకు వ్యక్తిగత బైకర్లు, స్థానిక రిటైలర్లు, వ్యాపార భాగస్వాములు, రవాణాదారులను నియమించుకోవడం ద్వారా భాగస్వామ్య కార్యక్రమాలను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. (PAN India 5G: కీలక విషయాలు వెల్లడించిన టెలికాం మంత్రి) అధిక కస్టమర్ డిమాండ్ నేపథ్యంలో పాన్-ఇండియాలో పార్శిల్ సార్టింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1.5మిలియన్ షిప్మెంట్లు లక్క్ష్యంగా పెట్టుకున్నామని డెలివరీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ పాయ్ అన్నారు. (jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?)