breaking news
Seasonal demand
-
వర్షమొచ్చింది.. బీరు గిరాకీ తక్కువ.. ధర ఎక్కువ!
కర్ణాటక, బెంగళూరు, బనశంకరి: బీరు తాగుదామని మందుబాబులు అనుకుంటే జేబుకు రంధ్రం పడుతోంది. చాలా మొత్తాన్ని ఇచ్చుకోవాల్సి ఉండడంతో బీరు వద్దులే అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ పథకాల నిధుల కోసం తరచుగా మద్యం, బీరు ధరలను పెంచడం మందుబాబులకు ఇబ్బందిగా తయారైంది. ముఖ్యంగా బీర్లను తాగడం తగ్గించారు, ఫలితంగా రాష్ట్రంలో గత నాలుగునెలల్లో బీర్ విక్రయాలు 19.65 శాతం తగ్గాయి. వేసవి నుంచి తగ్గుదల సాధారణంగా వేసవిలో మద్యంప్రియులు మద్యానికి బదులు ఎక్కువగా బీర్లు తాగుతారు. నగర, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా బీర్‌కు ఓటేస్తారు. కానీ ఈ వేసవి నుంచి బీర్‌కు గిరాకీ క్షీణించింది. బీరు ధర ఎక్కువగా ఉందనే కారణంతో దేశీయ మద్యం వైపు మొగ్గుచూపారు. దీంతో మద్యంతో పోలిస్తే బీర్ విక్రయం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ నుంచి బీర్ల కొనుగోళ్లు తగ్గాయి. భారీ స్థాయిలో.. రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 1,420 లక్షల లీటర్ల (182.08 లక్షల బాక్సులు) బీర్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది ఇదే అవధిలో 1,141 లక్షల లీటర్లు(146.30 లక్షల బాక్సులు) లే అమ్మారు. గత ఏడాదితో పోలిస్తే భారీ మొత్తంలో తగ్గుదల నమోదైంది. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపుల్లో స్టాకు ఖాళీ కావడం లేదని చెబుతున్నారు. ఎడాపెడా రేట్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంపు లక్ష్యంతో బడ్జెట్‌కు ముందే బీర్ ధరలను పెంచింది. జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చేలా బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనివల్ల సాధారణం నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్ని బీర్ల ధరలు రూ.10 నుంచి 50 వరకు భగ్గుమన్నాయి. ఆల్కహాల్ అధికంగా ఉండే బీర్ల ధరలను మరింత పెంచేశారు. మే 15 నుంచి మరోసారి 5 శాతం పెంచారు. కాబట్టి అంత ధర పెట్టి బీరు తాగినా కిక్కు ఎక్కడం లేదని పానప్రియులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ బీర్ల కంపెనీలకు ఇస్తున్న కొనుగోలు ఆర్డర్లను కూడా కోత కోసింది. బెంగళూరు వంటి నగరాల్లో వర్షాకాలంలో బీర్లకు అధిక డిమాండ్ ఉంటుంది. యువతీ యువకులు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు సేవించడం అధికం. కానీ సేల్స్ తిరోగమనంలో పడిపోయినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. ధరల పెంపు కారణమని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. మద్యం వాడకం కూడా బీర్ తో పోలిస్తే దేశీయ మద్యం విక్రయాలు కూడా అంతగా పెరగలేదు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 2,164 లక్షల లీటర్ల ఐఎంఎల్ అమ్ముడైంది. ఈ ఏడాది ఇదే కాలంలో 2,135 లక్షల లీటర్లు విక్రయమైంది. బీర్లు, మద్యం కొనుగోళ్లు తగ్గినప్పటికీ ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు, ఎందుకంటే ధరలు, పన్నుల పెంపుతో అనుకున్న దానికంటే ఎక్సైజ్‌శాఖ కు ఆదాయం పెరుగుతోంది. కానీ ధర పెంపుతో వ్యాపారాలు తగ్గినట్లు వైన్‌షాపుల ఓనర్లు వాపోయారు. కొనుగోలు శక్తి తగ్గడంతో మద్యం ప్రియులు చవగ్గా దొరికే బీర్లు, లేదా మద్యం తాగి పద అంటున్నారు. ప్రీమియం బ్రాండ్లు కొనేవారు స్థానిక సరుకుతో సరిపెట్టుకుంటున్నారు. -
ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు
ముంబై: సరుకు రవాణా సేవల్లో ఉన్న డెలివరీ (Delhivery) సీజనల్ ఉద్యోగాల కోసం వచ్చే ఒకటిన్నర నెలలో 75,000 మందిని నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్ కంపెనీ తరఫున డెలివరీ గేట్వేస్, గిడ్డంగులు, డెలివరీ విభాగాల్లో 10,000 మంది ఉంటారు. పండుగ సీజన్లో పార్సెల్, ఎక్స్‌ప్రెస్ పార్ట్–ట్రక్ లోడ్ వ్యాపారం రెండింటిలోనూ ఆశించిన అధిక డిమాండ్‌ను చేరుకోవడం లక్ష్యంగా కొత్త వారిని చేర్చుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో పార్ట్-ట్రక్లోడ్ సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించేందుకు వ్యక్తిగత బైకర్లు, స్థానిక రిటైలర్లు, వ్యాపార భాగస్వాములు, రవాణాదారులను నియమించుకోవడం ద్వారా భాగస్వామ్య కార్యక్రమాలను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. (PAN India 5G: కీలక విషయాలు వెల్లడించిన టెలికాం మంత్రి) అధిక కస్టమర్ డిమాండ్ నేపథ్యంలో పాన్-ఇండియాలో పార్శిల్ సార్టింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1.5మిలియన్ షిప్మెంట్లు లక్క్ష్యంగా పెట్టుకున్నామని డెలివరీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ పాయ్ అన్నారు. (jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) -
పుత్తడికి సీజనల్ డిమాండ్
ధర పటిష్టంగా వుండవచ్చంటున్న బులియన్ ట్రేడర్లు ముంబై: ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధర మున్ముందు కూడా సీజనల్ డిమాండ్ కారణంగా పటిష్టంగానే వుంటుందని బులియన్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఇటీవల బాగా పెరిగినందున, చిన్నచిన్న సర్దుబాట్లు జరిగినప్పటికీ, పుత్తడికి రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని, పెళ్ళిళ్లు తదితరాల కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొనుగోళ్లు బావుంటాయని బులియన్ ట్రేడర్లు వివరించారు. క్రితం వారం ప్రథమార్థంలో దేశీయ మార్కెట్లో 22 నెలల గరిష్టస్థాయికి చేరిన పుత్తడి ధర, అటుతర్వాత లాభాల స్వీకరణకు లోనై, భారీగా పడిపోయింది. కానీ వారం చివర్లో స్టాకిస్టులు, రిటైలర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో తిరిగి పుంజుకుంది. అయితే అంతక్రితంవారంతో పోలిస్తే స్వల్పనష్టంతో ముగిసింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం గత శుక్రవారం, అంతక్రితంవారం ఇదేరోజుతో పోలిస్తే రూ. 55 నష్టంతో 29,395 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి ధర అంతే తగ్గుదలతో రూ. 29,245 వద్ద క్లోజయ్యింది. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఒకదశలో 1,287 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో ఆ స్థాయికి ధర పెరిగినా, అటుతర్వాత లాభాల స్వీకరణతో 1,259 డాలర్ల వద్దకు తగ్గి ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే 11 డాలర్ల మేర క్షీణించింది.