లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు

ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు అందుతున్నాయి. మరోవైపు దేశీ సూచీలు నాలుగు నెలల కనిష్టాలకు పడిపోయాయి. స్టాక్‌లు తక్కువ ధరకే వస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఈ రోజు ఉదయం ఆరంభంలోనే దేశీ సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు ఏడు వందల పాయింట్ల లాభంతో 53,513 పాయింట్ల దగ్గర మొదలైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 721 పాయింట్ల లాభంతో 997 పాయింట్లు లాభపడి 53,790 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 283 పాయింట్లు లాభపడి 16,093 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈరోజు ఈ ముద్ర ఐపీవోకి రానుంది.