జోరుమీదున్న సూచీలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

Daily Stock Market Update In Telugu May 18 - Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజు జోరుమీదున్నాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉండటం, షార్ట్‌ రికవరింగ్‌కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాలతో ఆరంభమయ్యాయి. 

ఈ రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభాలతో 54,554 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత 54,692 పాయింట్ల గరిష్టాలును టచ్‌ చేసింది. ఉదయం 9:30 గంటల సమయంలో 335 పాయిం‍ట్ల లాభంతో 54,653 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 16,356 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top