అదిరిపోయిన స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!

Cyborg Announces Three New Electric Bikes Starting at RS 114000 - Sakshi

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇగ్నీట్రాన్ మోటోకార్ప్'కు చెందిన స్వదేశీ ఈవీ స్టార్టప్ సైబోర్గ్ తన 3 ఎలక్ట్రిక్ బైకుల(యోడా, జీటీ 120, బాబ్-ఈ)కు సంబంధించిన ధరలను ఆవిష్కరించింది. ఈ బైక్ ధరలు వరుసగా ₹1,84,999(యోడా), ₹1,64,999(జీటీ 12), ₹1,14,999(బాబ్-ఈ)గా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో లభించే అదనపు సబ్సిడీల వల్ల వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ బైక్ మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. కంపెనీ త్వరలో మోటార్ సైకిళ్ల బుకింగ్ తేదీని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం రూ.999 మీకు ఇష్టమైన బైకును రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. 

క్రూయిజర్ యోడా
భారతదేశపు మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ క్రూయిజర్ యోడా మోటార్ బైక్ 3.24 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. యోడా ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్(బ్లాక్, సిల్వర్) వేరియెంట్లలో లభ్యం అవుతుంది. ఇది 40 కిలోమీటర్ల వేగాన్ని 3 సేకన్లలో అందుకుంటుంది. దీనిలో 72v, 3.24 kWH బ్యాటరీ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది.

బాబ్-ఈ
బాబ్-ఈ అనేది భారతదేశపు మొట్టమొదటి కాంపాక్ట్ స్పోర్టీ ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ డర్ట్ మోటార్ బైక్. ఇది 2.88 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. బాబ్-ఈ ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్(నలుపు, ఎరుపు) వేరియెంట్లలో లభ్యం అవుతుంది. ఇది 40 కిలోమీటర్ల వేగాన్ని 3 సేకన్లలో అందుకుంటుంది. దీనిలో 72v, 2.88 kWH బ్యాటరీ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది.

సైబోర్గ్ జీటీ 120 
సైబర్గ్ జీటీ 120 ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌లో 4.32 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది ఇది 6 కిలోవాట్ల సామర్థ్యాన్ని అందిస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో ఈ స్పోర్ట్స్ బైక్ 180 కిలోమీటర్ల వరకు వెళ్తుందని ఈ సంస్థ స్పష్టం చేసింది. ఈ సరికొత్త సైబర్గ్ జీటీ 120 మోటార్ సైకిల్ 2.5 సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. ఈ సంస్థకు చెందిన సైబర్గ్ యోడా, సైబర్గ్ బాబ్ వేరియంట్ల మాదిరిగా కాకుండా దీనికి సైజ్, వెయిట్‌కు తగినట్లుగా ఫిక్స్‌డ్ బ్యాటరీని పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

15 ఆంపియర్ల ఫాస్ట్ హోం ఛార్జర్‌తో 5 గంటల్లోనే పూర్తి ఛార్జ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. సైజ్, వెయిట్‌కు తగినట్లుగానే ఈ బైక్ బ్యాటరీని ఫిక్స్ చేశారు. వెదర్ ప్రూఫ్, టచ్ సేఫ్ బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. సైబోర్గ్ జీటీ 120 మోటార్ సైకిల్‌లో కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంది. అంతేకాకుండా ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో అందుబాటులోకి వచ్చింది. జియో ఫెన్సింగ్, జియో లొకేషన్, యూఎస్బీ ఛార్జింగ్, బ్లూటూత్, వైర్లెస్ ఇగ్నీశషన్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డిస్‌ప్లేకో రైడర్‌కు బ్యాటరీ లైఫ్ లాంటి వివరాలను చూపిస్తుంది. అంతేకాకుండా దీని డిస్‌ప్లేకు ఐపీ65 రేటింగ్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

(చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top