బాండ్ల జారీలో తగ్గిన కార్పొరేట్‌ స్పీడ్‌ | Corporate Fund Raising through Bond Declined in FY 22 | Sakshi
Sakshi News home page

బాండ్ల జారీలో తగ్గిన కార్పొరేట్‌ స్పీడ్‌

Apr 16 2022 11:07 AM | Updated on Apr 16 2022 11:17 AM

Corporate Fund Raising through Bond Declined in FY 22 - Sakshi

న్యూఢిల్లీ: బాండ్ల జారీ ద్వారా  మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు కేవలం రూ.5.88 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో ఈ మార్గంలో నిధుల సమీకరణ ఇంత తక్కువ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. 2020–21లో ఈ విధానం ద్వారా కార్పొరేట్లు రూ.7.72 లక్షల కోట్ల నిధుల సమీకరించాయి. అంటే వార్షికంగా చూస్తే 24 శాతం తగ్గాయన్నమాట. 

ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరును కనబరచడం, బ్యాంకింగ్‌ తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల నేపథ్యంలో ఈ సాధనాల ద్వారానే నిధుల సమీకరణకు కార్పొరేట్లు మొగ్గు చూపినట్లు  మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెక్యూరిటీస్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. వడ్డీరేట్ల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మూలధన అవసరాలు పెరగడం వంటి పరిస్థితుల్లోనే తిరిగి కార్పొరేట్ల ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్ల వైపు దృష్టి సారించవని విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి: ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మళ్లీ డిఫాల్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement