ట్యాక్స్‌ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే.. తెలుసుకుంటే పన్ను ఆదా పక్కా!

Common tax planning mistakes - Sakshi

ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నాం. ఈ దశలో ట్యాక్స్‌ ప్లానింగ్‌ అన్నది చాలా ముఖ్యమైన అంశం. చివరి నిమిషంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పన్ను ఆదా చేయడానికి ముందుగా ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ఇలా ట్యాక్స్‌ ప్లానింగ్‌ చేసుకునేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవి సమర్థవంతమైన ట్యాక్స్‌ ప్లానింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి.

ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే..

అవగాహన ముఖ్యం
ప్రస్తుత ఖర్చులపై అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం పొరపాటు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రణాళికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. 

బీమా ప్రీమియం రూ.5 లక్షలు మించకూడదు
ఏడాదికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంతో బీమా పాలసీలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు ఉండదని 2023 బడ్జెట్ స్పష్టం చేసింది. కాబట్టి పన్ను మినహాయింపుల కోసం బీమా పాలసీలలో పెట్టుబడి పెట్టేవారు దానికి చెల్లించే ప్రీమియం ఏడాదికి రూ. 5 లక్షల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. ఇక అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా! 

క్రెడిట్ కార్డ్‌ వినియోగంలో జాగ్రత్త!
పన్ను మినహాయింపుల కోసమని కొంతమంది క్రెడిట్ కార్డ్‌ని ఉపయోస్తుంటారు. ఇలా చేయడం చాలా పొరపాటు. ఎందుకంటే ఇది అప్పులు పెరిగేందుకు దారితీయవచ్చు.

ముందుగానే ప్లానింగ్‌ మంచిది
ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ట్యాక్స్‌ ప్లానింగ్‌ అంటే ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి ఆఖరు నెల వరకు ఆగకుండా ముందుగానే ట్యాక్స్‌ ప్లానింగ్‌ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. పన్ను ఆదా చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top