SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే..

Indian Startups Deposits Worth 1 Billion dollars In SVB - Sakshi

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) దివాలా తీసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఆ బ్యాంకులో మన దేశానికి చెందిన స్టార్టప్‌లు కూడా డిపాజిట్లు పెట్టాయి. దీనిపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూనే ఉంది.

సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారత స్టార్టప్ కంపెనీల నిధులు ఇరుక్కున్నాయా అనే వివరాలను శోధిస్తోంది. ఈ క్రమంలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ ఇటీవల తన రెండు సబ్సిడరీ కంపెనీలకు చెందిన నిధులు ఎస్‌వీబీలో ఉన్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఇలా ఎన్ని సంస్థల డిపాజిట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో ఉన్నయానే దానిపై కేంద్రం ఆరా తీసింది.

ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?

సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారతీయ స్టార్టప్‌లకు చెందిన సుమారు 1 బిలియన్‌ డాలర్ల (రూ. 8,251.5 కోట్లు) విలువైన డిపాజిట్లు ఉంటాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అంచనా వేశారు. ఈ స్టార్టప్‌లను స్థానిక బ్యాంకులు ఆదుకోవాలని, వారికి మరింతగా రుణాలు ఇవ్వాలని సూచించారు. అనిశ్చిత పరిస్థితులతో సంక్లిష్టమైన యూఎస్‌ బ్యాంకింగ్ వ్యవస్థపై మన దేశ  స్టార్టప్‌లు  ఆధారపడకుండా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలా మార్చాలి అన్నది ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉందని ట్విట్టర్ స్పేస్ చాట్‌లో కేంద్ర మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌!

సిలికాన్ వ్యాలీ బ్యాంకు 2022 చివరి నాటికి 209 బిలియన్‌ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. సంక్షోభం తలెత్తిన వెంటనే డిపాజిటర్లు ఒక్క రోజులోనే 42 బిలియన్‌ డాలర్ల వరకు ఉపసంహరించుకున్నారు. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న ఎస్‌వీబీని మూసివేశాయి. ఆ తర్వాత యూఎస్‌ ప్రభుత్వం డిపాజిటర్లకు వారి నిధులన్నింటికీ యాక్సెస్ ఉండేలా చర్యలు చేపట్టింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top