మొబైల్‌ ఫోన్‌ చార్జర్ల కష్టాలకు చెక్‌.. ఈ ఐడియా అదిరింది!

Common Charger Usb C Mandatory For All Smartphones In India - Sakshi

ఒకేరకం చార్జర్‌ అమలుకు పరిశ్రమ సమ్మతి

న్యూఢిల్లీ: త్వరలో మొబైల్‌ ఫోన్‌ చార్జర్ల కష్టాలకు తెరపడనుంది. ఉన్నట్టుండి చార్జింగ్‌ అయిపోతే, మరొకరి ఫోన్‌ చార్జర్‌తో అవసరం గట్టెక్కవచ్చు. ఇందుకు వీలుగా ఒకేరకమైన చార్జింగ్‌ పోర్ట్‌ను దశలవారీగా అమలు చేయడానికి మొబైల్‌ ఫోన్, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్ర విని యోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది.

ఏకరూప చార్జింగ్‌ పోర్ట్‌ సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఉప కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వశాఖల టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఏఐటీ, ఫిక్కీ, సీఐఐ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ వారణాసి విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను యూఎస్‌బీ టైప్‌–సీ చార్జింగ్‌ పోర్ట్‌తో తీసుకొచ్చేందుకు పరిశ్రమ ప్రతినిధులు సమ్మతి తెలిపారు.

చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top