మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా

Come out with insurance products for persons with disabilities, mental illness - Sakshi

బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం

న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్‌ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది.

ఐఆర్‌డీఏఐ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్‌లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్‌రైటింగ్‌ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top