కాగ్నిజెంట్‌ కొత్త సీఈవో రవి కుమార్‌ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!

 Cognizant new CEO Ravi kumari salary is 4 times Mukesh Ambani 2020 pay - Sakshi

సాక్షి,ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా,ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్‌ను ఎంపికయ్యారు.  నాలుగేళ్ల పాటు కంపెనీకి సేవలందించిన మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్‌ నియమితులయ్యారు. గ్రోత్‌కు సంబంధించి మంజి పొజిషన్‌లో ఉన్న కాగ్నిజెంట్‌ సీవోగాఎంపిగాకవడం  సంతోషంగా ఉందని అని కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

కంపెనీ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్న కుమార్ కాగ్నిజెంట్‌లో ఆన్-డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్ ,అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు. అయితే దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్‌  వార్షికవేతనం ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

2020లో అంబానీ  జీతం కంటే నాలుగు రెట్ల అధికం
రవి కుమార్‌ జీతం 2020లో ముఖేశ్‌ అంబానీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువట. రవి కుమార్ మొత్తం జీతం సంవత్సరానికి రూ. 57 కోట్లు (7 మిలియన్ డాలర్లు). దీంతోపాటు దాదాపు రూ. 6 కోట్లు( 7,50,000 డాలర్ల )జాయినింగ్ బోనస్‌ను కూడా అందు కోనున్నారు. యాన్యువల్‌ బేసిక్‌ సాలరీగా ఒక మిలియిన్‌డాలర్లు  చెల్లింస్తుంది  కంపెనీ. అలాగే  2 మిలియన్‌ డాలర్ల నగదు ప్రోత్సాహకం, వన్ టైమ్ హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్‌లను పొందనున్నారు. .కాగా  గత రెండేళ్లుగా అంబానీ కేవలం రూ. 1 మాత్రమే జీతంగా తీసుకున్నారని గమనించాలి. 2019-20లో ముఖేశ్‌ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు.

కాగా 2016 నుంచి 2022 మధ్య కాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రవి కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.మొత్తం రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలోనే కొనసాగారు. కుమార్ ట్రాన్స్‌యూనియన్ , డిజిమార్క్ కార్ప్ బోర్డులలో కూడా పనిచేశారు. హంఫ్రీస్ రాజీనామా చేయడంతోరవికుమార్‌ను ఎంపిక చేసింది కాగ్నిజెంట్‌. ప్రత్యేక సలహాదారుగా మార్చి 15 వరకు కంపెనీలోనే ఉంటారు హంఫ్రీస్ .

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top