NSE Co-Location Scam: 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి చిత్ర రామకృష్ణ..!

Chitra Ramkrishna Sent To 14-Day Judicial Custody, No Home-Cooked Food Allowed - Sakshi

ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణను ఢిల్లీ కోర్టు నేడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి నిచ్చింది. చిత్ర రామకృష్ణ తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని, దర్యాప్తుకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలియజేసింది. జ్యుడీషియల్ కస్టడీ సమయంలో రామకృష్ణ కోసం ఇంట్లో వండిన ఆహారాన్ని తెచ్చుకునేందుకు న్యాయవాది కోరారు. అయితే, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆహారం కూడా మంచిదని న్యాయమూర్తి చెప్పారు. విచారణ సమయంలో వీఐపీ సౌకర్యాలు కల్పించాలని ఆమె న్యాయమూర్తి కోర్టును కోరారు. దీనిని  కూడా కోర్టు తిరస్కరించింది. 

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో(ఎన్‌ఎస్‌ఈ) కో-లొకేషన్​ కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ చిత్రారామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసింది. ఎన్‌ఎస్‌ఈ కొలోకేషన్‌ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్‌ఎస్‌ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్‌ఎస్‌ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్‌ చేసింది.   

(చదవండి: కో-లొకేషన్ కుంభకోణంలో హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top