శాలరీ డబుల్‌,మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు భారీగా ఎందుకు పెరుగుతున్నాయంటే!

CEO Satya Nadella says Microsoft is almost doubling salaries as company  - Sakshi

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల బంపరాఫర్‌ ప్రకటించారు. త్వరలో ఉద్యోగుల శాలరీలను డబుల్‌ చేస్తున్నట్లు తెలిపారు. సత్య నాదెళ్ల ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
   

"కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని నట్టేట ముంచారు. మీరొద్దు. మీరిచ్చే జీతాలొద్దు. కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు ఊడబీకారు. నష్టాలంటూ శాలరీల్లో కోత విధించారు. డబుల్‌ హైక్‌లు, ప్రమోషన్‌లు ఇస్తామంటే మేం ఎందుకు పనిచేస్తాం. కరోనా తెచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నామంటూ..ఉద్యోగస్తులు.. వారు చేస్తున్న ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నాం". ఇదిగో ఇలా పుట్టుకొచ్చిందే ఈ దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌. ఇప్పుడీ ఈ అంశం ప్రపంచ దేశాలకు చెందిన అన్నీ సంస్థల్ని కలవరానికి గురిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేస్తూ ఉద్యోగులకు మెయిల్‌ పెట్టారు. 

'నియర్లీ డుబల్డ్‌ ది గ్లోబల్‌ మెరిట్‌'. ముఖ్యంగా మిడ్‌ కెరియర్‌ (35 నుంచి 45 మధ్య వయస్సు) ఉద్యోగుల శాలరీలు మరింత పెరగనున్నాయి. అంతేకాదు క్లయింట్లకు, భాగ‌స్వాముల‌కు మీరందించిన అస‌మాన సేవ‌ల‌తో మ‌న నైపుణ్యాల‌కు అధిక డిమాండ్ ఉంద‌ని మ‌రోసారి నిరూప‌ణ అయింది. నా తరుపున మీ అందరికి కృతజ్ఞతలు.అందుకే మీ అంద‌రిపై దీర్ఘ‌కాల పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధమయ్యామని సత్య నాదెళ్ల తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్స్‌లో పేర్కొన్నారు.

చదవండి👉నాకొద్దీ ఉద్యోగం.. భారత్‌లో 'ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌' సునామీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top