ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు

ముసాయిదా సిద్ధం చేస్తోన్న కేంద్రం
ఈవీలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
వెబ్‌డెస్క్ : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)లు కొనేందుకు వీలుగా పలు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ ముసాయిదా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఈవీకి ప్రోత్సహకాలు
కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోలు దిగుమతులు తగ్గించడం లక్ష్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు జై కొడుతోంది కేంద్రం. దీనికి తగ్గట్టే ఆటోమోబైల్ కంపెనీలు ఈవీ వెహికల్స్‌ని మార్కెట్‌లోకి తెస్తున్నాయి. అయితే కేంద్రం ఆశించినంత వేగంగా అమ్మకాల జోరు కొనసాగడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.
ఇవి సరిపోవు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగాలంటే మరిన్ని రాయితీలు, ప్రోత్సహకాలు కావాలని ఇటు వినియోగదారులు, అటు ఆటోమోబైల్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్వల్ప రాయితీలతో పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నాయి. మన దేశంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 300 నుంచి రూ. 1,500 వరకు ఉన్నాయి.