Amazon: నాసిరకం ప్రెజర్‌ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్‌కు భారీ ఫైన్‌!

Ccpa Imposed 1lakh Penalty On Amazon For Selling Pressure Cookers - Sakshi

ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను అమ్ముతుందంటూ అమెజాన్‌కు సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) ఫైన్‌ విధించింది. 

సీసీపీఏ అమెజాన్‌ ఫ్లాట్‌ ఫామ్‌లో వినియోగదారులు కొనుగోలు చేసిన 2,265 ప్రెజర్ కుక్కర్లను పరిశీలించింది. వాటి పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటిని రీకాల్‌ చేయడంతో పాటు కొనుగోలు దారులకు డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 

క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్‌(క్యూసీఓ) నిబంధనకు విరుద్దంగా ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు జరిపిన అమెజాన్‌ లక్షరూపాయల పెనాల్టీని సీసీపీఏకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమెజాన్‌ క్యూసీవో నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ సీపీపీఏ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అమెజాన్‌ ఎంత సంపాదించిందంటే  
క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్‌(క్యూసీఓ) ప్రకారం.. 2,265 ప్రెజర్ కుక్కర్లలలో నాణ్యత లోపించింది. ఆ కుక్కర్లను అమ్మగా అమెజాన్‌ రూ.6,14,825.41 సంపాదించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top