ఎన్‌బీఎఫ్‌సీల కోసం క్యాష్‌ఫ్రీ డిజిటల్‌ సొల్యూషన్‌

Cashfree Payments Launches Lending Solution For Nbfcs - Sakshi

హైదరాబాద్‌: నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), వాటి భాగస్వామ్య సంస్థల కోసం కొత్తగా డిజిటల్‌ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌ సీఈవో ఆకాష్‌ సిన్హా తెలిపారు. రుణ వితరణ, వసూళ్ల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. 

రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత డిజిటల్‌ లెండింగ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సొల్యూషన్స్‌ పని చేస్తుందని సిన్హా వివరించారు. రుణగ్రహీత గుర్తింపు, బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా నేరుగా రుణ గ్రహీత ఖాతాలోకే రుణాల బదలాయింపు మొదలైనవి దీనితో సులభతరం అవుతాయని పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top