Candy Company Release Job For Candy Taste Tester Yearly Salary 1 Lakh Dollar - Sakshi
Sakshi News home page

వావ్‌ అదిరిపోయే జాబ్‌ నోటిఫికేషన్‌.. రుచి చూస్తే చాలు నెలకు రూ.6 లక్షలు!

Jul 25 2022 2:36 PM | Updated on Jul 25 2022 4:06 PM

Candy Company Release Job For Candy Taste Tester Yearly Salary 1 Lakh Dollar - Sakshi

చదివిన చదువుకు నచ్చిన ఉద్యోగం పొందేందుకు యువత అహర్నిశలు శ్రమిస్తుంటారు. అనుకున్నది సాధిస్తారు. అదే సమయంలో కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగి కోసం అంతే శ్రమ పడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని ఉద్యోగాలు భలే తమాషాగా ఉంటాయి. వీటికి కూడా జీతం ఇస్తారా అనిపిస్తుంటుంది.

తాజాగా అమెరికాకు చెందిన ఓ సం‍స్థ అలాంటి జాబ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఆ జాబ్‌ ఏంటో తెలుసా? ఆఫీస్‌లో కూర్చొని  తినడమే. పైగా భారీ ఎత్తున శాలరీ పే చేసేందుకు సిద్ధమైంది. ఆ..ఏంటీ..తినేందుకు జాబ్‌.. పైగా అందుకు కళ్లు చెదిరిపోయే శాలరీ ఇస్తారా అని ఆశ్చర్యపోకండి. 

వివరాల్లోకి వెళితే..ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆన్‌లైన్ క్యాండీ రిటైలర్ కంపెనీ తమ సంస్థకి చీఫ్ కాండీ ఆఫీసర్ పోస్ట్‌ కోసం ఉద్యోగి కావాలని నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఈ కంపెనీలో తయారయ్యే చాక్లెట్‌ను రుచి చూసి రేటింగ్‌ ఇస్తే చాలు. ఇందుకు అర్హతగా ఐదేళ్లు నిండిన వారెవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తూ చేసుకోవచ్చని తెలిపింది. ఎంపిక కాబడిన వారికి ఏడాదికి రూ. 1లక్ష డాలర్లు జీతం ఇస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement